‘ఆర్ఆర్ఆర్’ – మూడు గెటప్స్ లో ఎన్టీఆర్

Young Tiger NTR To Mesmerize Audience With Three Different Get ups In Rajamouli RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jr NTR,RRR,RRR Movie Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Jr NTR Role In RRR,Jr NTR Character In RRR Telugu Movie

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అల‌రించ‌నున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్ట‌ని రాజ‌మౌళి మ‌రి కొద్ది రోజుల‌లో ఫ‌స్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు ఈ చిత్రానికి తెలుగులో ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం అనే టైటిల్ పెట్టె యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హిందీలోను చిత్రం విడుద‌ల కానుండ‌గా, అక్క‌డ ‘రామ రావణ్ రాజ్’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ డైలాగ్ లు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఇది ఎంత నిజమో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.