వైవిధ్యభరిత పాత్రలకు పెట్టింది పేరు లోకనాయకుడు కమల్ హాసన్. స్వతహాగా తమిళ కథానాయకుడైనప్పటికీ… దేశవ్యాప్తంగా అశేష అభిమానగణాన్ని పొందారాయన. ఇక తెలుగు పరిశ్రమతోనూ కమల్ కి మంచి అనుబంధమే ఉంది. ఇక్కడ నేరుగా నటించిన పలు చిత్రాలు ఘనవిజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. మరీ ముఖ్యంగా… దర్శకదిగ్గజం కె. విశ్వనాథ్ కాంబినేషన్ లో కమల్ నటించిన చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి. వాటిలో `స్వాతిముత్యం` ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో శివయ్య పాత్రలో కమల్ హాసన్ కనబరిచిన అభినయం అద్వితీయం, రమణీయం, చిరస్మరణీయం. కమల్ హాసన్ పోషించిన పాత్రల్లో టాప్ 10లో నిలిచే పాత్రగా `స్వాతిముత్యం` శివయ్యని చెప్పుకోవచ్చు. ఇక లలిత పాత్రలో రాధిక కూడా తనదైన నటనతో చెరగని ముద్ర వేసింది. ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. `సువ్వీ సువ్వీ`, `మనసు పలికే మౌన గీతం`, `లాలీ లాలీ`, `చిన్నారి పొన్నారి కిట్టయ్య` పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.




పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం… పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అలాగే `ఉత్తమ ప్రాంతీయ చిత్రం` విభాగంలో జాతీయ పురస్కారం అందుకోవడమే కాకుండా `ఉత్తమ చిత్రం`గా `నంది` పురస్కారాన్ని కూడా అందుకుంది. అలాగే `ఉత్తమ నటుడు`గా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడుగా కె. విశ్వనాథ్ `నంది` పురస్కారాలను అందుకున్నారు. 1986 మార్చి 13న విడుదలైన `స్వాతిముత్యం`.. నేటితో 34 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























