ఒక హీరో సినిమా ప్లాప్ అయిందంటే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుందో… హిట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియని విషయం కాదు. సినిమా ప్లాప్ అయిందంటే హీరో తో సినిమా చేయడానికి భయపడతారు.. ఇక హిట్ వస్తే ఆ హీరో వెంట పడతారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే…ఇప్పుడు రామ్ పరిస్థితి కూడా అలానే ఉంది. అసలుసంగతేంటంటే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి రావడంతో ఇప్పుడు ‘రెడ్’ సినిమా కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందట. .ఆంధ్రలో ఈ సినిమా థియేటర్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడుపోగా… అలాగే సీడెడ్ లో 4 కోట్ల బిజినెస్ జరిగిందట. మిగిలిన ఏరియాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికే రెండు ఏరియాల్లోనే 15 కోట్ల బిజినెస్ జరిగిందంటే గ్రేటే. మిగిలిన ఏరియాల్లో ఎంత జరిగిందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.




కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాకు ఇది రీమేక్. ఇక ఫస్ట్ లుక్ లోనే రామ్ లుక్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























