`నేనే రాజు నేనే మంత్రి`(2017) వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ హీరో దగ్గుబాటి రానా, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `రాక్షస రాజు రావణాసురుడు` పేరుతో రూపొందనున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రానా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అంతేకాదు.. అతనికి జోడీగా ముగ్గురు కథానాయికలు నటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం నాయికల అన్వేషణ సాగుతోందని వినికిడి. త్వరలోనే షూటింగ్ డిటైల్స్ తో పాటు నాయికల వివరాలు వెల్లడి కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే…. రానా హీరోగా నటించిన మల్టీలింగ్వల్ మూవీ `అరణ్య` ఏప్రిల్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే రానా పిరియాడిక్ డ్రామా `విరాటపర్వం` కూడా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వేసవి చివరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే అవకాశముందని కథనాలు వస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: