`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ టార్గెట్ గా వ‌రుణ్, నితిన్ చిత్రాలు?

Varun Tej And Nithiin New Movies,Varun Tej Nithiin Movies To Release On This Special Date,Nithiin New Movie,Varun Tej New Movie Release On Special Date,Varun Tej,Nithiin,Varun Tej New Film Updates,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

`భీష్మ‌` ఘ‌న‌విజ‌యం యువ క‌థానాయ‌కుడు నితిన్ లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక‌వైపు ఆ స‌క్సెస్ ని ఆస్వాదిస్తూనే.. మ‌రోవైపు `రంగ్ దే`, `చెక్` చిత్రాల షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నాడు నితిన్. కాగా, వీటిలో `రంగ్ దే`నే ముందుగా తెర‌పైకి రానుంది. `తొలి ప్రేమ‌` ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే`లో నితిన్ కి జోడీగా `మ‌హాన‌టి` కీర్తి సురేష్ న‌టిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్రచారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. అదే రోజున మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న‌ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కానున్న‌ట్లు ఇప్ప‌టికే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సో… `ఆర్ ఆర్ ఆర్` ప్రీవియ‌స్ రిలీజ్ డేట్ జూలై 30 (ఇప్పుడు జ‌న‌వ‌రి 8 విడుద‌ల తేదీ)కి వ‌స్తున్న‌ వ‌రుణ్, నితిన్… ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటారో చూడాలి.

అన్న‌ట్టు.. వ‌రుణ్ గ‌త చిత్రం `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్`లో నితిన్ అతిథి పాత్ర‌లో మెరిసిన సంగ‌తి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.