`అల వైకుంఠపురములో` ఘనవిజయంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మికా మందన్న నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి 40 రోజుల పాటు సాగే లాంగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా రాజ్ దీపక్ శెట్టి నటిస్తున్నాడని సమాచారం. గత ఏడాది సెన్సేషన్ హిట్ గా నిలచిన `ఇస్మార్ట్ శంకర్`లో రాజ్ దీపక్ విలన్ గా నటించాడు. కాగా, రాజ్ దీపక్ శెట్టి ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




ఈ ఏడాది దసరా సీజన్ లో బన్నీ – సుక్కు చిత్రం రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























