బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టని రాజమౌళి మరి కొద్ది రోజులలో ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొనగా ఈ రోజు హోళీ సెలవు తీసుకున్నాడు ఎన్టీఆర్. భార్య లక్ష్మీ ప్రణతి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి హోళీ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన అభిమానులకు హోళీ శోభాకాంక్షలు తెలియజేస్తూ… సోషల్ మీడియా వేదికగా హోళీ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసాడు.
Wishing you all a very #HappyHoli pic.twitter.com/dTJ1V9iZlK
— Jr NTR (@tarak9999) March 10, 2020



కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి8 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























