ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కథానాయికల్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకరు. ఆమె నటించిన పలు నాయికా ప్రాధాన్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో `ఒసేయ్ రాములమ్మ`(1997) ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. `ప్రతిఘటన`(1985) తరువాత ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మళ్ళీ `ఒసేయ్ రాములమ్మ`తోనే సాధ్యమైంది. ఈ రెండు సినిమాల్లోనూ విజయశాంతి కథానాయిక కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దొరలపై తిరుగుబాటు చేసిన ఓ మహిళ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో దాసరి ఓ ముఖ్య భూమిక పోషించగా.. సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు. రామిరెడ్డి, శకుంతల, అశోక్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు. `వందేమాతరం` శ్రీనివాస్ అందించిన బాణీలు `ఒసేయ్ రాములమ్మ`కి ప్రధాన బలంగా నిలిచాయి. టైటిల్ సాంగ్ తో పాటు `రామసక్కని తల్లి`, `లచ్చులో లచ్చులా`, `ఓ చౌదరి గారూ`, `పుల్లల మంటివి`.. ఇలా దాదాపు ప్రతీ పాట విశేషాదరణ పొందింది. ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో ఈ చిత్రానికి రెండు `నంది` పురస్కారాలు దక్కాయి. 1997 మార్చి 7న విడుదలైన `ఒసేయ్ రాములమ్మ` నేటితో 23 ఏళ్ళను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































