మొత్తానికి చూడబోతే భారతీయుడు 2 సినిమాకు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం కాస్త కష్టమే అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటినుండీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఫైనల్ గా షూటింగ్ ను చక చకా చేసుకుంటూ వెళ్తుండగా ఈసారి మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి మరోసారి బ్రేక్ పడింది. రీసెంట్ గా క్రేన్ పడి పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు… అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ… ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ ఈ ప్రమాదంలో మరణించారు. దీనిలో భాగంగా పోలీసులు ఈ కేసుపై విచారణ ప్రారంభించారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ తో పాటు దర్శకుడు శంకర్, కమల్ హాసన్ లని కూడా పోలీసులు విచారిస్తున్నారట. దీనితో మరోసారి షూటింగ్ కు లాంగ్ బ్రేక్ పడింది. అంతేకాదు ఈ సినిమా ఇక ముందుకు వెళ్లడం కూడా కష్టమే అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























