మార్చి 6వ తేదీ రిలీజ్ కానున్న 7 సినిమాలు

7 Telugu Movies To Release On This Special Date,latest telugu movies news, elugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Latest Telugu Movies Release On Special Date,7 Telugu Movies Release this Week,Telugu Movies releasing Releasing this week,upcoming telugu movies 2020

మూవీ లవర్స్ కు ప్రతీ శుక్రవారం పండగే. ప్రతీ శుక్రవారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తాయని తెలిసిన విషయమే. మార్చి 6వ తేదీ శుక్రవారం 7 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు వాటి మీద ఓ లుక్ వేద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. ఓ .. పిట్టకథ : భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చెందు ముద్దు దర్శకత్వంలో సంజయ్ రావు, విశ్వంత్ , నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన  పాత్రలలో గ్రామీణ వాతావరణం లో స్వఛ్చమైన ప్రేమకథ గా ” ఓ .. పిట్టకథ” మూవీ తెరకెక్కింది. ఈ మూవీ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరో గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

2. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి :బ్లాక్ &వైట్ పిక్చర్స్ , పూర్వి పిక్చర్స్ బ్యానర్స్ పై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ, కోమలి ప్రసాద్ , త్రిథా చౌదరి, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ థ్రిల్లర్ ” అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి”6 వ తేదీ రిలీజ్ కానుంది. రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్ ముఖ్య పాత్రలలో నటించారు.

3 . పలాస 1978 : తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణ లో సుధాన్ మీడియా బ్యానర్ పై కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా యధార్థ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ “పలాస 1978” మూవీ రూపొందింది. “పలాస 1978” మూవీకి సంగీతం అందించిన రఘు కుంచె ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడం విశేషం.

4. కాలేజ్ కుమార్ :లక్ష్మణ గౌడ సమర్పణలో ఎమ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై హరి సంతోష్ దర్శకత్వంలో రాహుల్, ప్రియా వడ్లమాని జంటగా, చదవడం గొప్పా, చదివించడం గొప్పా అనే నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “కాలేజ్ కుమార్ ” మూవీ రూపొందింది. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్రలో నటించారు.

5. అర్జున : నట్టి ఎంటర్ టైన్ మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ లో AA ఆర్ట్స్ బ్యానర్ పై కన్మణి దర్శకత్వంలో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా రాజకీయాల నేపథ్యం లో “అర్జున ” మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో హీరో రాజశేఖర్ తండ్రీకొడుకులు గా నటించడం విశేషం.

6. స్క్రీన్ ప్లే : బుజ్జి బుడుగు ఫిల్మ్స్ బ్యానర్ పై కె ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో విక్రమ్ శివ, ప్రగతి యాదాటి జంటగా “స్క్రీన్ ప్లే ” మూవీ రూపొందింది. “స్క్రీన్ ప్లే ” మూవీ పలు ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపిక అయ్యింది .

7. కృష్ణ మనోహర్ IPS:యనమల సుధాకర్ నాయుడు సమర్పణ లో పవన పుత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో ప్రభుదేవా, నివేత పేతురాజ్ జంటగా “కృష్ణ మనోహర్ IPS” మూవీ రూపొందింది. “పొన్ మాణిక్యవేల్” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “కృష్ణ మనోహర్ IPS” మూవీ. ప్రభు దేవా 50 వ మూవీ గా రూపొందిన ఈ మూవీ తమిళ , తెలుగు వెర్షన్స్ 6వ తేదీ రిలీజ్ కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.