చిరు ‘లూసిఫర్’ బాధ్యత వినాయక్ కు..!

Megastar Chiranjeevi Join Hands With VVVinayak For Lucifer Telugu Remake

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో గత ఏడాది మార్చిలో వచ్చిన ‘లూసిఫర్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకొని.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరు ప్రధాన పాత్రలో చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హక్కులు సొంతం చేసుకున్నాడు కానీ అప్పటినుండీ.. ఈ సినిమా డైరెక్టర్, హీరో విషయంలో మాత్రం చరణ్ ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. ఇక ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా చరణ్ ఈ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. అంతేకాదు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను వి.వి. వినాయక్ కి అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో చిరంజీవి వున్నాడట. గతంలో చిరంజీవితో వినాయక్ చేసిన ‘ఠాగూర్’ ..’ఖైదీ నెంబర్ 150′ సినిమాలు భారీ విజయాలను దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలు రీమేక్ లే. అందుకే చిరంజీవి .. వినాయక్ వైపు మొగ్గుచూపుతున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవాలనుకుంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. మరి ఈ సినిమా అయిపోయిన తర్వాత చిరు ఆ సినిమాను మొదలుపెడతాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.