త్రివిక్రమ్ మూవీ – ఎన్టీఆర్ కు ఈ హీరోయిన్ అయితే బావుంటుంది..?

Director Trivikram Plans To Rope In This Heroine For Jr NTR New Movie

మొన్నటి వరకూ ఎన్టీఆర్ ఎవరితో సినిమా తీస్తారు అని తెగ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలన్నిటికీ బ్రేక్ వేస్తూ ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ తోనే అని అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి చర్చ. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా వస్తుంది అన్నప్పుడే మొదట పూజా హెగ్డే పేరు వినిపించింది. అరవింద సమేత సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా మళ్ళీ పూజాహెగ్డే నే హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నారట. ఆ తర్వాత ఈ సినిమాలో రష్మిక మందన్న నటించనున్నట్టు వినిపించింది. ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నందుకు రష్మిక ను తీసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందన్న టాక్స్ వినిపించాయి. అంతే కాదు రష్మిక ఇప్పటి వరకూ ఎన్టీఆర్ తో జత కట్టలేదు. దీనితో కాబినేషన్ కూడా ఫ్రెష్ గా ఉంటుందని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందు ఈ సినిమాలో పూజా హెగ్డే నే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు.. మళ్ళీ పూజాహెగ్డే నే హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రష్మిక ను తీసుకుంటున్నట్టు టాక్స్ వినిపించాయి. వీరిద్దరి తర్వాత తెరపైకి వచ్చిన మరో పేరు సమంత. సమంత కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో 4 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కనుక వస్తే 5వ చిత్రం అవుతుంది. చూద్దాం ఫైనల్ గా త్రివిక్రమ్-ఎన్టీఆర్ ఆ హీరోయిన్ కు ఫిక్స్ అవుతారో. మరి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో మీ ఓటు ద్వారా తెలపండి.

[totalpoll id=”38472″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.