విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో అప్పుడే అమ్మడు మన యంగ్ హీరోపై ప్రశంసలు కురిపించేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనన్య…” విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్ అండ్ కైండ్… అందరితోనూ చాలా కలుపుగోలుగా మాట్లాడతాడు. సెట్లో ఎప్పుడూ నవ్వుతూ సందడి చేస్తుంటాడు. కొత్తవారితో ఎలా మాట్లాడాలో ఆయనకి బాగా తెలుసు… విజయ్ దేవరకొండ మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. ఆయనతో ఈ సినిమా చేస్తున్నందు వలన ప్రత్యక్షంగా చూస్తున్నాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిస్తోంది” అని చెప్పుకొచ్చింది.




మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























