ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదే జోష్ తో కె.జి.ఎఫ్ సీక్వెల్ కె.జి.ఎఫ్- చాప్టర్ 2 ను కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ చిన్నగా ఒక్కొక్కటి ఇస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి తన వర్క్ ను స్టార్ట్ చేసినట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Btw….KGF2 Work staaarted💕
— RamajogaiahSastry (@ramjowrites) February 22, 2020
[custom_ad]
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: