ఫైనల్లీ మెగా హీరో లుక్ రిలీజ్

Uppena Movie Team Releases Panja Vaisshnav Tej First Look

మొత్తానికి మెగా హీరో ముఖాన్ని చూపించారు. మెగా హీరో ఏంటీ..? ముఖం ఏంటీ..? అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా ఇప్పటివరకూ సినిమాలో లుక్ ను మాత్రం చూపించలేదు. ఫస్ట్ లుక్ లో చూపించలేదు.. కానీ అందులో వైష్ణవ్ తేజ్ ముఖాన్ని చూపించలేదు. చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులోను అదే పరిస్థితి. ముఖాన్ని మాత్రం చూపించలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిల పూర్తి లుక్ ని రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లను బట్టి చూస్తే ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ ‘ఆసి’ అనే పాత్రలో.. కృతి శెట్టి పాత్ర సంగీత పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

[custom_ad]

కాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మెగా హీరో అదృష్టం ఎలా ఉందొ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.