ఇటీవలే `డిస్కో రాజా`గా ఎంటర్ టైన్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం `క్రాక్`తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ స్టోరీ మే 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలయ్యేలోపే `రాక్షసుడు` దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు రవితేజ. ఇందులో మాస్ మహారాజా రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
అంతేకాదు… ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఓ బాలీవుడ్ భామ మెయిన్ లీడ్ గా నటించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలుగులో రెండు భారీ చిత్రాలు చేసిన ఆ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఆ నాయిక విషయంపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































