మారిన ‘RRR’ రిలీజ్ డేట్

RRR Special Promo Video To Come Out Soon,#RRR, #RRR Movie, Jr NTR, Latest Telugu Movies News, Rajamouli, Ram Charan, RRR Movie Updates, RRR Special Promo, RRR Special Promo Video Release Date, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

మొత్తానికి అనుకున్నదే జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ విషయంలో గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని.. ముందు ఫిక్స్ చేసిన డేట్ కు రావడం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. నిజంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.