`ఫిదా` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `లవ్ స్టోరి`. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. సాయిపల్లవి పుట్టినరోజుని పురస్కరించుకుని మే 9న ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాలతో సాయిపల్లవి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే, ఆ తరువాత వచ్చిన `కణం`, `పడి పడి లేచె మనసు` నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో.. `లవ్ స్టోరి` ఫలితం పల్లవికి కీలకంగా మారింది. మరి.. లక్కీ డైరెక్టర్ కాంబోతో మరోమారు `ఫిదా` బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























