రాసి కన్నా వాసికే అధిక ప్రాధాన్యమిచ్చే యువ కథానాయకుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. `ముకుంద`(2014)తో హీరోగా తొలి అడుగేసిన వరుణ్.. ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలతో పలకరించాడు. వీటిలో ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. అంతేకాదు… 2017 నుంచి ఏడాదికి రెండు చిత్రాల చొప్పున విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వరుణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
2017లో `మిస్టర్`, `ఫిదా`… 2018లో `తొలిప్రేమ`, `అంతరిక్షం`.. 2019లో `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో పలకరించిన ఈ కొణిదెల స్టార్.. 2020లోనూ అదే బాట పట్టనున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న వరుణ్.. త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించనున్నాడు. కాగా, ఈ రెండు సినిమాలు కూడా 2020 ద్వితీయార్ధంలోనే రిలీజ్ అయ్యే అవకాశముంది. మరి.. గత ఏడాది రిలీజైన రెండు సినిమాలతోనూ ఘనవిజయాలు చూసిన వరుణ్.. ఈ ఏడాదిలోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























