విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘అసురన్’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ‘అనంతపురం’లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకి ‘నారప్ప’అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[custom_ad]
కాగా ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరి తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. మరి తెలుగులో ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: