యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకి యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జయాపజయాలకు అతీతంగా తనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు విజయ్. కేవలం తెలుగునాటే కాదు.. ఇతర దక్షిణాది పరిశ్రమల్లోనూ, హిందీ చిత్రసీమలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఇలాంటి క్రేజ్ ఉంది కాబట్టే.. విజయ్ దేవరకొండ పేరిట ఎప్పటికప్పుడు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, రీసెంట్ గా విజయ్ కు ఉన్న క్రేజ్ ఏ పాటిదో యూట్యూబ్ వేదికగా మరోసారి నిరూపితమైంది. గత ఏడాది పాన్ సౌత్ ఇండియన్ మూవీగా విడుదలైన `డియర్ కామ్రేడ్`… బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, దాని హిందీ వెర్షన్ యూ ట్యూబ్ లో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. `డియర్ కామ్రేడ్` హిందీ వెర్షన్ ని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన 24 గంటల్లో లోపే.. 12 మిలియన్ వ్యూస్ రావడం చూస్తే… విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో మరోసారి స్పష్టమవుతోంది. మరి.. ఒక రోజులోనే ఇలా రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టుకున్న `డియర్ కామ్రేడ్` హిందీ వెర్షన్.. విజయ్ కున్న తిరుగులేని క్రేజ్ తో మున్ముందు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: