`స‌రిలేరు నీకెవ్వ‌రు`కి ఆ సెంటిమెంట్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

Sarileru Neekevvaru Movie Brings Back This Hit Combo

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సార్లు సంక్రాంతి బ‌రిలో దిగాడు. `ట‌క్క‌రిదొంగ‌` (2002), `ఒక్క‌డు` (2003), `బిజినెస్ మేన్`(2012), `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`(2013), `1-నేనొక్క‌డినే`(2014).. ఇలా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఐదు విభిన్న క‌థాంశాల‌తో మ‌హేష్ సంక్రాంతికి సంద‌డి చేశాడు. వీటిలో `ట‌క్క‌రిదొంగ‌`, `1-నేనొక్క‌డినే` మిన‌హా మిగిలిన మూడు చిత్రాలు కూడా క‌మ‌ర్షియ‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ మూడు చిత్రాల్లోనూ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర పోషించాడు. క‌ట్ చేస్తే… ఈ సంక్రాంతి కానుక‌గా వ‌స్తున్న మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`లోనూ ప్ర‌కాష్ రాజ్ విల‌న్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మ‌రి.. సెంటిమెంట్ రిపీట్ అయి.. మ‌హేష్, ప్ర‌కాష్ కాంబినేష‌న్ లో మ‌రో సంక్రాంతి హిట్ చేరుతుందేమో చూడాలి. కాగా, రేపు (జ‌న‌వ‌రి 11) `స‌రిలేరు నీకెవ్వ‌రు` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.