భారతదేశం గర్వించదగ్గ నటుల్లో దక్షిణాది అగ్రశ్రేణి కథానాయకులు సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కి విశిష్ఠ స్థానం ఉంటుంది. అలాంటి కమల్, రజినీతో కలసి నటించడం ఎవరికైనా గౌరవప్రదమే. అలాంటి అరుదైన అవకాశాలను అందుకున్న వారిలో యువ కథానాయిక నివేదా థామస్ చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశేషమేమిటంటే.. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న నివేదాకి రెండు సందర్భాల్లోనూ కూతురిగా నటించే అవకాశం దక్కడం గమనార్హం. ఆ మధ్య `దృశ్యం` తమిళ రీమేక్ `పాపనాశం` (2015)లో కమల్ కి తనయగా నటించిన నివేదా… ఐదేళ్ళ అనంతరం ఇప్పుడు రజినీకి కూతురిగా `దర్బార్`(2020)లో దర్శనమివ్వనుంది. మరి.. `పాపనాశం`తో విజయం చూసిన నివేదా.. `దర్బార్`తోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
కాగా, `దర్బార్` రేపు (జనవరి 9) థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























