అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్ప్రైజ్ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా అది యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన డాంగ్ డాంగ్ లిరికల్ సాంగ్తో పాటు విజయశాంతి, అనీల్ రావిపూడి ఇంటర్వ్యూ.. డాంగ్ డాంగ్ వీడియో సాంగ్లు యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచాయి. దీనిలో భాగంగానే తాజాగా వరుసగా 1,5,10 స్థానాలలో చిత్రానికి సంబంధించి వీడియోలు నిలవడంతో మేకర్స్ ఈ విషయాన్ని ఆనందంగా ప్రకటించారు.
A SUPER Perfect start to 2020💥#SarileruNeekevvaru videos trending on YouTube at #1, #5 & #10 👏👏#SLNManiaOnYouTube 🤘
Super ⭐ @urstrulyMahesh @vijayashanthi_m @AnilRavipudi @AnilSunkara1 @RathnaveluDop @ThisIsDSP #SuperStarSankranthi pic.twitter.com/S0xC1L9Zvu
— AK Entertainments (@AKentsOfficial) January 1, 2020
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: