మా మీటింగ్ లో చిరంజీవి మాటను పెడచెవిన పెట్టిన రాజశేఖర్

Hero Rajashekar Defers With Chiranjeevi In MAA Meeting

వేడుక: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వార్షిక డైరీ ఆవిష్కరణ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేదిక: హోటల్ పార్క్ హయత్

వేదికపై: రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి, డాక్టర్ మంచు మోహన్ బాబు, డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి,  మా పూర్వ అధ్యక్షుడు ప్రముఖ నటుడు నిర్మాత మురళీమోహన్, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, సహజనటి జయసుధ, మా అధ్యక్షుడు నరేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీమతి జీవిత ఇంకా ఎందరెందరో నటీనటులు.

ఏం జరిగింది ?

డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణ వ్యాఖ్యానం తో ప్రారంభమైన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో డైరీ ఆవిష్కరణ అనంతరం తొలుత కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు ప్రసంగించారు. మోహన్ బాబు ప్రసంగం పూర్తవగానే పరుచూరి గోపాలకృష్ణ తదుపరి కార్యక్రమం ఎనౌన్స్ చేయబోతుండగా హఠాత్తుగా ఆయన చేతిలోని మైక్ తీసుకున్నారు. డాక్టర్ రాజశేఖర్. మైక్ తీసుకున్న రాజశేఖర్ ఎవరూ ఊహించని విధంగా
వివాదాస్పద విషయాల ప్రస్తావన తెచ్చారు. “మనం తెరమీద హీరోలుగా నటిస్తుంటాం … కానీ నిజ జీవితంలో హీరోలుగా పనిచేస్తుంటే ఇక్కడ తొక్కేస్తున్నారు  . ముందుగా అనుకున్నది ఒకటి ఇక్కడ మాట్లాడుతుంది వేరొకటి”- అనటంతో అందరూ షాక్ అయ్యారు.

ఈ సమయంలో మోహన్ బాబు రాజశేఖర్ కు సర్ది చెప్పటానికి ప్రయత్నించగా ‘మోహన్ బాబుగారూ మీరు అరుచుకుంటే ఏమీ కాదు.. నన్ను మాట్లాడనివ్వండి అంటూ తన ధోరణిని కొనసాగించారు రాజశేఖర్. దీంతో అందరికీ ఒక ఉద్విగ్న స్థితి ఎదురయింది . ముఖ్యంగా  డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సజావుగా సాగాలని తన ప్రసంగంలో ఎంతో అనునయంగా, బుజ్జగింపుగా మాట్లాడిన చిరంజీవి ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. అంతకు ముందు తను మాట్లాడుతున్నప్పుడే రాజశేఖర్ వేదిక మీదికి రావడానికి ప్రయత్నిస్తుండగా విషయం గ్రహించిన చిరంజీవి “నువ్వు రామాకు నాకు టెన్షన్ గా ఉంది” అని చమత్కరించారు కూడా.

తన ప్రసంగంలో పలు విషయాలను చక్కగా వివరించిన చిరంజీవి “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన “మంచి ఉంటే మైక్ లో చెప్పండి… చెడు ఉంటే చెవిలో చెప్పండి”- అనటంతో  చప్పట్లు మారుమోగాయి. అది జరిగిన కొద్ది సేపటికే రాజశేఖర్ ఆవేశంగా వివాదాస్పద విషయాలను లేవనెత్తడంతో  అది అనూహ్యమైన రసాభాసకు దారి తీసింది. ఎంత వారించినా వినకుండా మాట్లాడిన రాజ శేఖర్ ఆ తరువాత సభ నుండి బైటికివెళ్ళిపోయారు.  ఈ హఠాత్ పరిణామం నుండి తే రుకుంటుండగా చిరంజీవి మైక్ తీసుకుని “కేవలం రభస సృష్టించాలని ప్రీ ప్లాన్డ్ గా వచ్చినట్టుంది. ఇంతమంది పెద్దవాళ్లు వేదిక మీద ఉండగా ఇలా చేయటం పెద్దరికానికి ఏం మర్యాద ఇచ్చినట్లు, మేమందరం ఎందుకు వచ్చినట్లు? ఏ మాత్రం గౌరవం లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఇలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.. డిసిప్లినరీ కమిటీ ఏదైనా ఉంటే దీని మీద చర్య తీసుకోవాలి”- అన్నారు.

ఆ తరువాత సీనియర్ నటులు కృష్ణం రాజు మైక్ తీసుకుని ” ఇలా ప్రవర్తించటం సమంజసం కాదు. త్వరలోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ వేస్తాం… ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకోవాలి… పరిష్కరించుకోవాలి .అంతేగాని ఇలా మీడియాకి ఎక్కితే తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది”- అన్నారు. అప్పటికే రాజశేఖర్ సభ నుండి నుండి వెళ్లిపోవడంతో మిగతా కార్యక్రమం సజావుగా సాగింది.

కాగా చివరిలో చిరంజీవి ఈ గొడవంతా దయచేసి మీడియాలో ప్రజెంట్ చేయొద్దు… ఇది కేవలం కుటుంబ సమస్య… మీడియా దీనిని హైలెట్ చేసి జనం దృష్టికి తీసుకు వెళ్ళద్దు… అని మీడియాను రిక్వెస్ట్ చేశారు. కానీ అప్పటికే మీడియా ఈ రసాభాసను తీవ్రస్థాయిలో బ్లాస్ట్ చేసింది.

ఏది ఏమైనా గత రెండు దశాబ్దాలుగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చాలా హుందాగా నిర్వహించుకుంటుంది ‘ మా ‘ . ఎప్పుడు ఇలా జరగలేదు… ఆవేశం అణుచుకోలేకపోయిన రాజశేఖర్ కారణంగా జరిగింది ఈ రసాభాస. అయితే రాజశేఖర్ ఆవేశం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి. అతను ఆవేశపడిన సమయ, సందర్భాలు సరైనవి కాకపోవచ్చు కానీ ఆ ఆవేశానికి గల కారణాలను మాత్రం విశ్లేషించాలి….వాటిని పరిష్కరించాలి. అప్పుడు మాత్రమే ‘మా ‘ లో తరచుగా రగులుతున్న వివాదాల నిప్పు చల్లారుతుంది.

నిజానికి ఇలాంటి వివాదాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక్కదాంట్లో మాత్రమే జరగటం లేదు. సినీ రాజకీయ వ్యాపార రంగాలు అన్నింటిలో అసోసియేషన్లు ఉంటాయి. అన్నింటిలో ఇలాంటి రభస లు, రసాభాసలు మామూలే. వాటిని ఎవరు పట్టించుకోరు… ముఖ్యంగా మీడియా వాటిని ఫోకస్ చేయదు.

కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే గ్లామర్… ఆ గ్లామరే వాళ్ళ బలం ..అదే వాళ్ళ అదృష్టం… at the same time అదే వాళ్ళ దురదృష్టం కూడా.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.