శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్ఉత్కమ్ ,ధన్య బాలకృష్ణన్ జంటగా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ హల్ చల్. ఈ సినిమా ద్వారా శ్రీపతి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాల తో సహా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధం గా ఉంది. రేపు జనవరి 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రాంతి మాధవ్, శివ నిర్వణ, నిర్మాతలు బెక్కం వేణు గోపాల్, మల్కాపురం శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ…”రుద్రాక్ష్ నాకు మంచి ఫ్రెండ్, ఇండస్ట్రీలో ఉన్న తక్కువ ఫ్రెండ్స్ లో తాను ఒకడు, తాను ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాడు. ఈ సినిమా హిట్ అయ్యి చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో రుద్రాక్ష్ మాట్లాడుతూ….నన్ను నమ్మి ఈ సినిమా చేసిన నా నిర్మాతకు జీవితాంతం రుణపడి ఉంటాను. డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పగానే నచ్చింది, చేశాను. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది, రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు, అలాంటి సమయంలో శివకుమార్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. కొత్త కాన్సెప్ట్స్ ను అలరించే ఆడియన్స్ ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేక్షకులకు ఈ సంధర్భంగా కోరుకుంటున్న” అన్నారు.
నిర్మాత గణేష్ మాట్లాడుతూ….”హల్ చల్ మూవీని 3 ఏళ్ళ నుండి కష్టపడి తీశాము, ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి, అలాంటి సంధర్భంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ నాకు సపోర్ట్ చేశారు, ఆయనకు నా ప్రేత్యేక ధన్యవాదాలు. మా ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
కాగా ప్రత్యూష కొల్లూరి సమర్పణ లో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా మధునందన్,రవి ప్రకాష్,జెమిని సురేష్,ప్రీతీ నిగమ్,జోగినాయుడు నటిస్తున్నారు. ఈ సినిమాకు హనుమాన్,భరత్ మధుసూదన్ సంగీత దర్శకులు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ. నవంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























