పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో యాక్షన్ థ్రిల్లర్ “ఫైటర్” మూవీ షూటింగ్ జనవరి లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్ లో మరో నిర్మాతగా జాయిన్ కావడంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందనుంది. ఈ మూవీ లో పలువురు బాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారు. మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ ముంబై లోనే జరుగనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విజయ్ దేవరకొండ కు బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. విజయ్ బాక్సర్ గా నటించనున్న”ఫైటర్ “మూవీ ని హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో పూరి జగన్నాథ్ రూపొందించాలనుకున్నారు . పాన్ ఇండియా మూవీ గా రూపొందనుండటంతో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ని రూపొందించాలని పూరి జగన్నాథ్ &టీమ్ డిసైడ్ అయ్యారు. బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” కు సంగీతం అందించిన మణిశర్మ “ఫైటర్ ” మూవీకి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























