2019లో ఇంటి భోజనం చేసిన ఆ నలుగురు టాప్ స్టార్స్

Top Heroes Home Banner Movies Released In Tollywood 2019,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Top Heroes Home Banner Movies Released In Telugu Films,Top Heroes Home Banner Movies Released In Telugu Movies 2019,Top Heroes Home Banner Movies Released In Telugu 2019

ఒక్కోసారి  చరిత్రలో ఎవ్వరూ ఊహించని యాదృచ్చిక విశేషాలు చోటుచేసుకుంటాయి. వాటి గురించి చదివినప్పుడు ఇది నిజమేనే… తమాషాగా బాగుందే అనిపిస్తుంది. అలాంటిదే 2019లో మన సీనియర్ స్టార్స్ నలుగురు విషయంలో జరిగింది. సాధారణంగా స్టార్ హీరోలు సొంత బ్యానర్లో సినిమాలు చేయటం కొత్తేమీ కాదు. టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్- ఈ నలుగురికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి.నలుగురూ గతంలో డిఫరెంట్ బ్యానర్స్ పై సొంత చిత్రాలలో నటించిన వారే . అయితే ఈ అగ్రహీరోలు నలుగురు ఒకే క్యాలెండర్ ఇయర్లో తమ హోమ్ బ్యానర్స్ లో నటించటం 2019లో జరిగిన ఒక యాదృచ్చిక విశేషం. రిలీజ్ ఆర్డర్ ప్రకారం ఆ వివరాల్లోకి వెళితే …

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి బాలకృష్ణ :
తన తండ్రి గారైన దివంగత మహానటులు, మహానేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ – ‘ఎన్టీఆర్ మహా నాయకుడు’ పేర్లతో నిర్మించి, ఆయన పాత్రను అద్భుతంగా పోషించారు నందమూరి బాలకృష్ణ. ఎన్.బి.కె. ఫిలిమ్స్ బేనర్ పై క్రిష్ దర్శకత్వంలో నిర్మితమైన ఈ రెండు చిత్రాలు ఆర్థికపరమైన విజయాన్ని సాధించక పోయినప్పటికీ ప్రశంసలకు కొదవలేని గొప్ప ప్రయత్నాలుగా అభినందనలు అందుకున్నాయి. కాగా 2019 జనవరి 9న ‘ఎన్టీఆర్ కథానాయకుడు, ఫిబ్రవరి 22 న ‘ ఎన్టీఆర్ మహా నాయకుడు’ చిత్రాలు విడుదలయ్యాయి.

నాగార్జున:

రొమాంటిక్ ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలైజ్డ్ స్టార్ గా గుర్తింపు పొందిన గ్లామర్ స్టార్ నాగార్జున తమ సొంత సంస్థ’ మనం ఎంటర్ప్రైజెస్’ బ్యానర్ పై ‘ ఆనంది ఆర్ట్స్, వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలసి సంయుక్తంగా నిర్మించిన ‘ మన్మధుడు- 2’  ఆగస్టు 9న విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో  ఫ్రెంచ్ ఫిలిం ‘I Do’ ను రీమేక్ చేస్తూ నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోక పోయినప్పటికీ  రొమాంటిక్ స్టార్ గా ఆయనకు ఉన్న ఇమేజ్ ని సేఫ్ గార్డ్ చేసింది.

చిరంజీవి:

ఖైదీ నెంబర్ 150 తో అద్భుతమైన
రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం కోసం రెండు సంవత్సరాలు పైగా నిరీక్షించవలసి  వచ్చింది. ఒక డెడికేటెడ్ యాక్టర్ గా తన డ్రీమ్ క్యారెక్టర్ అయిన ‘అన్ సంగ్ హీరో’ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను అద్భుతంగా పోషిస్తూ సొంత బ్యానర్ “కొణిదెల ప్రొడక్షన్స్” పై
‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించారు చిరంజీవి. 2019 అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు వెర్షన్ చిరంజీవి కెరీర్లో టాప్ గ్రాసర్ గా నిలవటం విశేషం. ఆర్థిక లాభాల కన్నా హార్థిక లాభమే లక్ష్యంగా నిర్మితమైన ఈ uncompromised మెగా ప్రాజెక్ట్ నిర్మాతగా రామ్ చరణ్ కు, స్టార్ గా చిరంజీవికి గొప్ప జాబ్ శాటిస్ ఫాక్షన్ ఇచ్చింది.

వెంకటేష్:

2019 జనవరిలో  దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 2 చిత్రంతో స్టార్ గా  అద్భుత విజయాన్ని అందుకున్న విక్టరీ వెంకటేష్ కు డిసెంబర్లో ‘వెంకీ మామ’ రూపంలో మరో ఘన విజయం దక్కింది. బాబీ దర్శకత్వంలో  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలసి తన హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘వెంకీ మామ’ మంచి విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 13న తన జన్మదిన కానుకగా  రిలీజ్ అయిన ‘వెంకీ మామ’ వెంకటేష్ కు మంచి బర్త్ డే గిఫ్ట్ అయింది.

ఇవీ ఒకే క్యాలెండర్ ఇయర్లో నలుగురు అగ్రహీరోలు సొంత సంస్థల  ‘స్వగృహ ఫుడ్స్’ ను ఎంజాయ్ చేసిన విశేషాలు. నిజానికి ఇది ఇంతవరకు చరిత్రలో నమోదవ్వని చాలా అరుదైన విశేషం. గతంలో అంటే 30 ఏళ్ల క్రితం 1989లో ఈ నలుగురు అగ్రహీరోలు సొంత బ్యానర్స్ లో కాకపోయినా  సమీప బంధువుల సంస్థల్లో నటించి ఉన్నారు. ఆ వివరాలను గమనిస్తే –

గీతా ఆర్ట్స్ పతాకంపై చిరంజీవి  బావ అల్లు అరవింద్ నిర్మించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ 1989 జనవరి 14 న విడుదలైంది.

బాలకృష్ణ తోడల్లుడు ఎం ఆర్ వి ప్రసాద్ నిర్మించిన బాలగోపాలుడు అక్టోబర్ 13న విడుదలైంది.

అన్నయ్య వెంకట్ అక్కినేని, బావ యార్లగడ్డ సురేంద్ర సంయుక్తంగా నిర్మించగా అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషించిన సంచలన విజయం
‘ శివ ‘ అక్టోబర్ 5 న విడుదలైంది.

అన్నయ్య దగ్గుపాటి సురేష్  నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజుల్లో ఆయన బ్రెయిన్ చైల్డ్ గా నిర్మితమైన ‘ప్రేమ’  వెంకటేష్ కు ఒక మెమొరబుల్ ఫిలింగా నిలిచిపోవటమే కాకుండా ఆయనకు తొలిసారి ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును అందించింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ స్టైలిష్ లవ్ స్టోరీ 1989 జనవరి 12న విడుదలైంది.

ఇదీ- ఒకే క్యాలెండర్ ఇయర్లో
‘ఆ నలుగురు’ అగ్రహీరోల సొంత సినిమాల కమామీషు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.