పైన వున్న టైటిల్ ను చూసి ఇంతకూ ఆ సినిమా ఏంటబ్బా అన్న డౌట్ వచ్చింది కదా..? అసలుసంగతేంటంటే.. దివంగత అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. గుంజన్ సక్సేనా బయోఫిక్, రూహీ ఆఫ్జా, దోస్తానా2 సినిమాలతో బిజీగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…మాలాంటి తారల గురించి వచ్చే వదంతులకు లెక్కే లేదు. నేను ఒకసారి టెర్రరిజం మీద రాసిన పుస్తకాన్ని చదువుతున్నాను. ఎవరో ఫొటో తీసి తీవ్రవాదం నేపథ్య చిత్రంలో నటిస్తున్నానని రాశారు. వదంతులు రాయడానికి బాగానే ఉంటాయి. రాసే వాళ్లకు అవి ఆనందిస్తాయేమో గానీ మాకు చాలా బాధ కలిగిస్తాయి. చాలా సార్లు వాటిని మేము చూసీ చూడనట్లు వదిలేసినా కొన్ని చదవడం కష్టంగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లోని నా ఖాతాలో ఇతరులు పోస్టులు చేసే చాలా వ్యాఖ్యలను ఫిల్టర్ చేస్తుంటాను అని చెప్పింది. అంతేకాదు మా కుటుంబాన్ని అంతటినీ కలిపి సినిమా చేయాలంటే ఆ సినిమాకు పదివేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని… బహుషా అది విడుదల కాకపోవచ్చు… తెరపైకి వచ్చినా మేమే చూసుకోవాలి అని కామెడీ చేసింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























