పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో నాని 2020 సంవత్సరపు డైరీ ఫుల్ అయింది. హీరో నానిప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు కు నాని షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. చిన్న బ్రేక్ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విభిన్న కథా చిత్రాలు, నూతన దర్శకులను ఎంకరేజ్ చేసే నాని ఇప్పుడు ఒక యంగ్ దర్శకుడి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిట్ మూవీ “టాక్సీవాలా ” దర్శకుడు రాహుల్ ఎస్ దర్శకత్వంలో నాని నటించడానికి అంగీకరించారు కొంతమంది నూతన దర్శకుల స్క్రిప్ట్స్ కు నాని ఇంప్రెస్ అయ్యారని సమాచారం. కొన్ని స్క్రిప్ట్స్ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. నాని హీరోగా నటించే 3 మూవీస్ 2020 సంవత్సరంలో ప్రేక్షకులను అలరించనున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























