దిల్ రాజు కు బర్త్ డే శుభాకాంక్షలు – విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Sends Out Birthday Wishes To Dil Raju

మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ దిల్ రాజు కు బర్త్ డే విషెస్ తెలిపారు 2003 సంవత్సరం “దిల్ ” మూవీ తో టాలీవుడ్ కు దిల్ రాజు నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆ మూవీ ఘనవిజయంతో దిల్ అయన ఇంటి పేరుగా మారడం విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఆర్య , బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం, బృందావనం, M r పర్ ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, సుప్రీమ్ , శతమానం భవతి, నేను లోకల్, డిజె, ఫిదా, రాజా ది గ్రేట్, MCA , F 2 , మహర్షి మూవీస్ ఘనవిజయం సాధించాయి. అనేక మంది దర్శకులను దిల్ రాజు టాలీవుడ్ కు పరిచయం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు బర్త్ డే సందర్భంగా మరో మూవీ అనౌన్స్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో యూత్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా VD 12 మూవీ రూపొందనుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం విజయ్ హీరోగా నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్ ” మూవీ ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఫైటర్ మూవీ జనవరిలో ప్రారంభం కానుంది. ఇక దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా “టక్ జగదీష్ ” మూవీ రూపొందనుంది. VD 12 మూవీ షూటింగ్ 2020 సంవత్సరం ద్వితీయార్థం లో ప్రారంభం కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.