అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్‌తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత పవన్ మరో మల్టీ స్టారర్ లో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. హైలైట్ ఏంటంటే మల్టీ స్టారర్ కూడా రామ్ చరణ్ తో వుండబోతుందన్న క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పింక్ రీమేక్ తర్వాత పవన్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగిన మల్టీ స్టారర్ చేస్తారని అంటున్నారు.
మరి గతకొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై పూర్తి రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ కోసమే కేవలం 25 రోజుల డేట్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈటైమ్ లో పవన్ నుండి మల్టీస్టారర్ అంటే కొంచెం కష్టమైన విషయమే. చూద్దాం మరి ఏం జరుగుతుందో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























