త‌క్కువ గ్యాప్ లోనే ర‌వితేజ డ‌బుల్ ఎంట‌ర్ టైన్ మెంట్

Ravi Teja To Woo Audience With Back To Back Movie Releases In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Mass Maharaja Ravi Teja Latest News,Ravi Teja New Movies In 2020,Ravi Teja Upcoming Films In 2020,List Of Ravi Teja Movies Releasing In 2020

గ‌త ఏడాది `ట‌చ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌… ఈ సంవ‌త్స‌రం మాత్రం `జీరో రిలీజెస్`తో స‌రిపెట్టాడు. అయితే, వ‌చ్చే ఏడాది ఇందుకు భిన్నంగా త‌క్కువ గ్యాప్ లోనే రెండు సినిమాల‌తో ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఆ చిత్రాలే… `డిస్కో రాజా`, `క్రాక్`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ ఫిక్ష‌న్ మూవీ `డిస్కో రాజా` జ‌న‌వ‌రి 24న విడుద‌ల కానుండ‌గా… కాప్ స్టోరీగా తెర‌కెక్కుతున్న గోపీచంద్ మ‌లినేని డైరెక్టోరియ‌ల్ `క్రాక్` 2020 వేస‌విలో సంద‌డి చేయ‌నుంది. మ‌రి… `రాజా ది గ్రేట్` త‌రువాత స‌రైన విజ‌యం లేని ర‌వితేజ‌కి ఈ చిత్రాలైనా స‌క్సెస్ ని అందిస్తాయేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.