యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. `ఫైటర్` పేరుతో రూపొందనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే… పాన్ – ఇండియా మూవీగా తెరకెక్కనున్న `ఫైటర్`లో అతిలోక సుందరి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… `ఫైటర్` రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుండగా… జాన్వి ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతుందని తెలిసింది. ఏదేమైనా, జాన్వి ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మణిశర్మ సంగీతమందించనున్న `ఫైటర్` వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























