తండ్రికి తగ్గ వారసులు

Worthy Successors To Worthy Fathers

‘సూపర్ స్టార్’.. ఈ బిరుదు మహేష్ బాబుకు చాలా చక్కగా సరిపోతుంది. కేవలం ఒక్క సినిమాల్లోనే కాదు అన్నిరంగాల్లోనూ తనదైన మార్క్ చూపిస్తూ ‘సూపర్ స్టార్’ అనే బిరుదును సార్ధకం చేస్తున్నాడు. అటు సినిమాలు, సేవా కార్యక్రమాలు, పలు ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా, మల్టీప్లెక్స్ రంగంలోకి, నిర్మాణ రంగంలోకి, ఇంకా టెక్స్టైల్ రంగంలో కూడా అడుగుపెట్టి ‘హంబుల్’ అనే బ్రాండ్ ను కూడా తీసుకొచ్చాడు ఇలా అన్ని రంగాల్లోనూ తన మార్క్ ను చూపిస్తూ కంప్లీట్ బిజినెస్ మ్యాన్ కూడా అనిపించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తండ్రికి తగ్గ వారసులు అనిపించుకుంటున్నారు గౌతమ్, సితార. మహేష్ వారసులైన వీరికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.నిజం చెప్పాలంటే గౌతమ్ కొంచం సైలెంట్ కానీ సితార ఫుల్ యాక్టీవ్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళితే మహేష్ తర్వాత సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యేది మాత్రం సితారనే. ఇక ఇప్పటినుండే వీరిద్దరూ ఒక పక్క తమ చదువుతో పాటు మరోపక్క తమ టాలెంట్ ను కూడా చూపిస్తున్నారు.

ఇప్పటికే గౌతమ్ నేనొక్కడినే సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక మహేష్ బాబు కూతురు సితార పాప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సితార అయితే ఏకంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే పెట్టేసింది. తన స్నేహితురాలైన వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి తన వీడియో లతో అలరిస్తుంది. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మరి ఏకంగా ఒక హాలీవుడ్ డిస్నీ మూవీ ‘ఫ్రోజెన్2’ లో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఇక సూపర్‌ స్టార్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక యాడ్ కూడా చేసింది. ఓ కన్సస్ట్రక్షన్‌ కంపెనీకి చెందిన యాడ్‌లో మహేష్, భార్య నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలు కూడా నటించారు. ఈ యాడ్ తోనే సితార మొదటిసారి తెరమీదకు వచ్చింది. దీనితో చిన్నప్పట్నుంచే సితార కూడా స్టార్ అయిపోయింది.

దీనితో మహేష్ బాబులాగే వారసులు కూడా ఎక్కడా తగ్గకుండా తమ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. య‌థా తండ్రి.. త‌థా త‌న‌య‌, తనయుడు అని నిరూపించుకుంటున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు వీరిద్దరూ మహేష్ పేరును ఎంత నిలబెడతారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.