ధృవ్ ఎఫర్ట్స్ కు ఫలితమే ‘అశ్వమేథం’

Dhruva Hard Work Paying For Ashwamedham,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Ashwamedham Movie Updates,Ashwamedham Telugu Movie Latest News,Ashwamedham Movie Hero Latest News,Actor Dhruva About Ashwamedham Telugu Movie

నితిన్‌.జి దర్శకత్వంలో దృవ కరుణాకరన్ హీరోగా తెరకెక్కిన ‘ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌’ అశ్వమేథం. సైబ‌ర్ క్రైమ్ ఏదో ఒక రూపంలో జ‌రుగుతూనే ఉంది. అలాంటి సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యాన్ని ఆవిష్క‌రింప చేసే చిత్ర‌మే `అశ్వ‌మేథం`. ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రియా నాయర్‌, వందన యాదవ్‌, ఐశ్వర్య యాదవ్‌, శుభ మల్హోత్రా, రూపేష్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమాకు మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పోలీసులు, అధికారులు సైబ‌ర్ నేర‌గాళ్ల నుండి జాగ్ర‌త్త వ‌హించాల‌ని ఎంత చెబుతున్నా సైబర్ దాడులు జరుగుతూనే ఉంటాయి. సైబర్ సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలేంటి.. హ్యాకింగ్.. సైబర్ దాడుల గురించి చక్కగా చూపించారు. ఇక హీరోకి ఇది మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా చేశాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు… యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్లో చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అయితే ఇప్పుడున్న స్టార్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా చేశాడు ధృవ్. ధృవ్ సినిమా కోసం బాగానే ఎఫర్ట్స్ పెట్టినట్టు తెలుస్తుంది. తన ఫిజిక్, డాన్స్ లు మరియు ఫైట్స్ విషయంలో చాలా శిక్షణ తీసుకున్నారు అనిపిస్తుంది. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో చాలా వున్నాయి.

మరి కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కూడా చిన్న సినిమానా?పెద్ద హీరో సినిమానా? అని చూడటంలేదు కాబట్టి.. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే చెప్పొచ్చు.

కాగా ఈసినిమాలో ప్రాచి, సోన్యా, శివంగి కేదార్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సుమన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.