ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనాతో ప్రకాష్ రాజ్ అసెంబ్లీ కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. తర్వాత షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయనున్నారట.
ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: