‘రెడ్’ సినిమాలో భాగమైన నివేదా

Nivetha Pethuraj To Play Lead Role In Red Movie

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో రామ్ రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించగా… ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో రామ్‌పై మేజర్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు రిలీజ్ డేట్ ను కూడా అప్పుడే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది 2020 ఏప్రిల్ 9 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ హీరోయిన్లు గా నటించనున్నటు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో నివేదా పేతురేజ్ నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.