నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా నుండి ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతే కాదు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో మరోసారి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా బిజీగా ఉంది చిత్రయూనిట్.
కాగా ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంకా శివాంగి, సుమన్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సాన్యా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఔరోస్ అవతార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ సినమాకు సంగీతాన్ని అందిస్తుండగా.. జయపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























