కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ కూడా బాగా జరిగినట్టు తెలుస్తుంది. 7.5 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగినట్టు సమాచారం. మరి తెలుగులో కొన్ని సినిమాలకు కూడా ఇంత బిజినెస్ జరగట్లేదు. అలాంటిది విశాల్ సినిమాకు ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం గ్రేటే. కాగా ఈ సినిమాలో విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్గా నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: