అల్లు అరవింద్ చేతిలో సూర్య-జ్యోతిక సినిమా హక్కులు

Allu Aravind Acquires Rights of Suriya and Jyothika Movies,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Suriya and Jyothika Movie Updates,Star Producer Allu Aravind Upcoming Projects,Allu Aravind Latest News 2019

టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మధ్య పలు రీమేక్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాడు. తెలుగులో నాని హీరోగా వచ్చి భారీ సక్సెస్ సాధించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. దీనితో పాటు తాజాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్‌ డ్రామా మమాంగం సినిమా తెలుగు రైట్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను గత వరం రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా అరవింద్ మరో తమిళ్ సినిమా హక్కులను తీసుకున్నట్టు తెలుస్తుంది. సూర్య సొంత బ్యానర్లో జ్యోతిక ప్రధాన పాత్రధారిగా ‘జాక్ పాట్’ ఈ సీనిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సీనియర్ నటి రేవతి కూడా ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇక ఈ సినిమా తెలుగు హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. కల్యాణ్ దర్శకత్వం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.