గతకొద్ది కాలంగా రాజకీయాల్లోనే ఉన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ తో ఓకె చెప్పడంతో క్రిష్ కూడా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. అంతేకాదు.. ఫోక్ జానర్ కి సంబంధించిన కథను పవన్ కోసం క్రిష్ సిద్ధంచేస్తున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలకు తోడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాను లాంఛనంగా నవంబర్ 15వ తేదీన ప్రారంభించనున్నారట. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేస్తారట. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఇదిలా ఉండగా క్రిష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ కూడా చేయబోతున్నాడని అంటున్నారు. ఈ రీమేక్ కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కావాలనే ఈ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలపై ఒక క్లారిటీ రావాలంటే మాత్రం పవన్ స్పందించి క్లారిటీ ఇస్తేనే కానీ తెలీదు.
మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా గా చెప్పనవసరం లేదు. ఈ వార్తలే నిజమైతే.. పవన్ నిజంగా సినిమాల్లోకి వస్తే అభిమానులకు పండగే.. చూద్దాం ఏం జరుగుతుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































