90 ML మూవీ షూటింగ్ పూర్తి

90 ML Movie Finishes It’s Shooting Schedule,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,90 ML Movie Shooting Schedule,90 ML Telugu Movie,Karthikeya New Movie 90 ML,Karthikeya Latest News 2019

కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కార్తికేయ, నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ 90ML మూవీ రూపొందుతుంది . యూత్ లో క్రేజ్ ఉన్న కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటిస్తున్న ఈ మూవీ లో రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. MBA గోల్డ్ మెడలిస్ట్ దేవదాసు ఆథరైజ్డ్ డ్రింకర్ గా మారడం ఈ మూవీ కాన్సెప్ట్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తికేయ బర్త్ డే సందర్భంగా రిలీజయిన 90 ML మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఇనిపించుకోరు సాంగ్ యూత్ లో కేక పుట్టించింది. 90 ML మూవీ టాకీ పార్ట్ ముగించుకొని సాంగ్స్ చిత్రీకరణకై అజర్ బైజాన్ వెళ్ళిన విషయం తెలిసిందే. అజర్ బైజాన్ నుండి హైదరాబాద్ చేరుకున్నామని, 90 ML షూటింగ్ ముగిసిందని, ఈ రోజు వరకు తాను చేసిన
క్రేజీయెస్ట్ వర్క్ మీతో పంచుకోకుండా ఉండలేనని, వేచి ఉండండి అని కార్తికేయ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. 90 ML మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపొందిందని నిర్మాత అశోక్ రెడ్డిచెప్పారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.