లండన్ కూడా భళా ‘బాహుబలి’

Mangnum Opus Baahubali Craze In London,Baahubali Floors The London Audience, Baahubali London Audience, Baahubali Movie Latest News 2019, Baahubali Played at London Royal Albert Theater, latest telugu movies news, London Royal Albert Theater, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా వచ్చిన అవార్డుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులను దక్కించుకుంది.. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో లండన్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి: 1 సినిమాను ప్రదర్శించనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అలానే మొన్న ఈ సినిమాను హిందీలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్‌కి హాజరయ్యారు.

ఇదిలా ఉండగా 148 ఏళ్ల ఆల్బర్ట్‌ హాల్‌ చరిత్రలో ఇంగ్లీష్‌ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారట. మొత్తానికి లండన్ కూడా మన తెలుగు సినిమా సత్తా చూపించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.