మెగాస్టార్ తో సినిమా ప్లాన్..!

Sandeep Vanga Planning To Do A Film With Megastar Chiranjeevi,2019 Latest Telugu Movie News, Director Sandeep Reddy Vanga, Sandeep Reddy Vanga Latest News 2019, Sandeep Reddy Vanga To Realize His Dream, Sandeep Reddy Vanga Upcoming Projects, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ వంగ బాలీవుడ్ లో కూడా ‘కబీర్ సింగ్’ రీమేక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. షాహిద్ కపూర్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ రీమేక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా.. సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. సందీప్ వంగ రీమేక్ చేస్తేనే తాను నటిస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటే.. సందీప్ పై ఎంత నమ్మకం ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ లోనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. కబీర్ సింగ్ నిర్మాతలు అయిన టీ సీరిస్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా మరో న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. మెగాస్టార్ తో సందీప్ వంగా సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చిరు కోసం సందీప్ ఓ కథతో రెడీ గా ఉన్నాడంటా.. అంతేకాదు త్వరలో ఆయనకు కలిసి కథను వినిపించనున్నాడట కూడా. మరి ఇది నిజమేనా..? ఇందులో ఎంత నిజముంది అన్న విషయం తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక సందీప్ వంగా చిన్నప్పటినుండి చిరంజీవి అభిమాని అని మనకు తెలిసిందే. మరి చిరుతో కనుక నటించే అవకాశం వస్తే సందీప్ డ్రీం ఫుల్ ఫిల్ అయినట్టే..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.