BVSN ప్రసాద్ సారథ్యం లో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై రూపొందిన ఛత్రపతి, డార్లింగ్, సాహసం, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో ఈరోజు హైదరాబాద్ లో గోపీచంద్ 28 మూవీ షూటింగ్ ప్రారంభమయింది. సక్సెస్ ఫుల్ మూవీ సాహసం తరువాత ఆ బ్యానర్ లో హీరో గోపీచంద్ నటిస్తున్న రెండవ మూవీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ తో ప్రారంభమైంది. గోపీచంద్, తమన్నా ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ కి సీటీమార్ టైటిల్ పరిశీలన లో ఉంది. దర్శకుడు సంపత్ నంది,తమన్నా కాంబినేషన్ లో రూపొందిన బెంగాల్ టైగర్, రచ్చ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 2020 సంవత్సరం సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ కానుందని సమాచారం. ఇక గోపీచంద్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ 5వ తేదీ రిలీజ్ కానుంది. చాణక్య మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొని చాణక్య మూవీ పై అంచనాలు పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: