పూజా హెగ్డే… టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయికగా నటిస్తోంది. అంతేకాదు… వీటిలో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో దర్శనమివ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న‘అల వైకుంఠపురములో’ ఆల్ట్రా మోడ్రన్ గాళ్‌గా స్టైలిష్, ట్రెండీ లుక్స్ లో కనిపించనున్న పూజ… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పిరియాడిక్ లవ్ స్టోరీ ‘జాన్’లో స్కూల్ టీచర్‌గా అభినయానికి అవకాశమున్న పాత్రలో దర్శనమివ్వనుందట. ఇక అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో బబ్లీ గర్ల్ పాత్రలో అలరించనుందని సమాచారం. అలాగే విడుదలకు సిద్ధమైన హిందీ చిత్రం `హౌస్ ఫుల్ 4`లో ఒకదానితో ఒకటి పొంతన లేని రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనుంది పూజ.
మరి… విలక్షణ పాత్రలకే ఓటేస్తూ ముందుకు సాగుతున్న పూజా హెగ్డే… ఈ నాలుగు చిత్రాలతోనూ వరుస విజయాలను అందుకుంటుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























