మాస్ మహారాజా రవితేజ… ప్రస్తుతం `డిస్కో రాజా`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా… డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ లోపే `డాన్ శీను`, `బలుపు` చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీని పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు రవితేజ. అంతేకాదు… మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ టాలెంటెడ్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవల `రాక్షసుడు` వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు రమేష్ వర్మ…. తాజాగా రవితేజని సంప్రదించి ఓ స్క్రిప్ట్ వినిపించాడట. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో… రవితేజ కూడా వర్మతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే… 8 ఏళ్ళ క్రితమే రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో `వీర`(2011) వచ్చింది. అయితే, ఆ చిత్రం ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. మరి… ఈ సారైనా ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































