మెగా కాంపౌండ్ హీరోలకి కలిసొచ్చిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయితేజ్, వరుణ్ తేజ్… ఇలా మెగా హీరోలతో హరీష్ తెరకెక్కించిన ప్రతీ సినిమా విజయం సాధించింది. అలా సక్సెస్ చూసిన చిత్రాల్లో… సాయితేజ్ హీరోగా నటించిన `సుబ్రమణ్యం For సేల్’ ఒకటి. రెజీనా నాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో అదా శర్మ, నాగబాబు, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, నరేష్, ఝాన్సీ, ప్రగతి, సురేఖా వాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ ఆదరణ పొందాయి. ముఖ్యంగా… మెగాస్టార్ చిరంజీవి పాపులర్ సాంగ్ “గువ్వా గోరింకతో” (ఖైదీ నంబర్ 786)ని రీమిక్స్ చేసిన తీరు మెగా అభిమానులను మురిపించింది. అలాగే… చంద్రబోస్ కలం నుంచి జాలువారిన “తెలుగంటే” పాట కూడా శ్రోతలను రంజింపజేసేంది. బెంగాలీలో ఈ చిత్రాన్ని ‘చాల్బాజ్’ పేరుతో పునర్నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన `సుబ్రమణ్యం For సేల్’… 2015 సెప్టెంబర్ 24న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 4 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: