స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టబు, జయరామ్, నివేదా పెతురాజ్, నవదీప్, సుశాంత్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. బన్నీ, టబు, నివేదా పెతురాజ్, సత్యరాజ్ కాంబినేషన్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే…. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… జనవరి 12ని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారని తెలిసింది. త్వరలోనే విడుదల తేదిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























